చరణ్ పుట్టినరోజున సెట్స్ పైకి బన్నీ?
- బన్నీ19వ సినిమాకి రంగం సిద్ధం
- ఈ నెల 27న షూటింగు మొదలు
- హ్యాట్రిక్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును ఈ నెల 27వ తేదీన ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రోజున చరణ్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనను అల్లు అర్జున్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చరణ్ .. బన్నీ మధ్య ఎంతటి అనుబంధం .. ఆత్మీయత వున్నాయనే సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాతో, త్రివిక్రమ్ .. బన్నీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.