'రెమో' దర్శకుడితో కార్తీ .. హీరోయిన్ గా రష్మిక
- భాగ్యరాజ్ కన్నన్ తో కార్తీ
- మార్చి 2వ వారంలో సెట్స్ పైకి
- కథానాయికగా రష్మిక మందన
'దేవ్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, ఆ వెంటనే తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కార్తీ రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, మార్చి 2వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రెమో' భారీ విజయాన్ని సాధించడం వలన, ఈ ప్రాజెక్టుపై అంచనాలు వున్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమిళంలోను రష్మిక బిజీ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది