టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై వైసీపీ నేత పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు
- పవన్ పావలా అయితే నీ రేటు అర్ధ రూపాయా?
- శుక్రవారం జగన్ గుర్తుకు రావడం ఏంటి?
- ఎన్టీఆర్ పార్టీలో మల్లెపూలు అమ్ముకునేవారు ఉండడం బాధాకరం
ఇక శుక్రవారం రాగానే జగన్‌కు కోర్టు గుర్తుకు వస్తుందంటూ గతంలో యామిని చేసిన వ్యాఖ్యలపైనా పృథ్వీ స్పందించారు. శుక్రవారం అయితే ఓ ఆడపిల్లగా మహాలక్ష్మి గుర్తుకు రావాలని, లేదంటే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలని, కానీ జగన్‌మోహన్ రెడ్డి ఎందుకు గుర్తుకొస్తున్నారో ఆమెకే తెలియాలని అన్నారు. ఇకపై ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేసి ప్రభుత్వం ఏవైనా మంచి పనులు చేసి ఉంటే వాటి గురించి మాట్లాడాలని పృథ్వీ ఆమెకు సలహా ఇచ్చారు.