భరోసా లేకపోవడం వలన .. సర్దుకుపోతూ వచ్చాను: సీనియర్ నటి అన్నపూర్ణ
- అప్పట్లో ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం
- ఇక్కడ మసలుకోవడం చాలా కష్టం
- భరోసా లేకపోవడమే కారణం
చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి రావడం వలన విభిన్నమైన పాత్రలను చేయగలిగాను. అగ్ర హీరోలందరికీ తల్లిగా చేయగలిగాను. అప్పట్లో వాళ్లంతా డైమండ్స్ .. వాళ్ల మధ్యలో బంగారంలా మెరిసే అవకాశం లభించింది. ఒకసారి రావుగోపాలరావు గారు .. 'కారు కొనుక్కో అమ్మా .. పారితోషికం పెరుగుతుంది' అన్నారు. ఆ విషయం అమ్మకి చెబితే వద్దని అంది. ఇది సెక్యూరిటీ వున్న జాబ్ కాదు. ఎవరికి కోపం వచ్చినా మేమే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడినా సమస్యే .. తక్కువ మాట్లాడినా కష్టమే. భరోసా లేకపోవడం వలన .. సర్దుకుపోతూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.