'మైఖేల్'గా విజయ్ .. అట్లీ కుమార్ తో మూడో మూవీ
- సంచలన విజయాన్ని సాధించిన 'సర్కార్'
- 'మైఖేల్' పాత్రలో విజయ్
- కథానాయికగా నయనతార
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో 'మైఖేల్' అనే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి 'మైఖేల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు, దాదాపు దీనినే ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.