'దేవ్' రంగంలోకి దిగిపోతున్నాడు
- రజత్ రవిశంకర్ తో కార్తీ
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'దేవ్'
- ఈ నెల 14వ తేదీన విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీ - రకుల్ కి మంచి క్రేజ్ వుంది. ఇంతకుముందు ఈ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' సినిమా తెలుగులోను విజయాన్ని అందుకుంది. అందువలన 'దేవ్' కూడా సక్సెస్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.