'దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు
- రజత్ రవిశంకర్ నుంచి 'దేవ్'
- మరోసారి కార్తీ జోడీగా రకుల్
- ఈ నెల 14వ తేదీన విడుదల
ఈ నెల 10వ తేదీన అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను ఆరంభించనున్నారు. హారిస్ జైరాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంతకుముందు కార్తీ - రకుల్ జంటగా నటించిన 'ఖాకీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సహజంగానే 'దేవ్'పై అంచనాలు వున్నాయి. ఈ జంటకి ఈ సినిమా కూడా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.