బాలకృష్ణతో సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన వినాయక్
- 'మహానాయకుడు' పనుల్లో బాలకృష్ణ
- బోయపాటి, అనిల్ రావిపూడి లతో చిత్రాలు
- ఈ ఏడాదిలోనే వినాయక్ తోనూ మూవీ
ఇక ఇప్పట్లో వినాయక్ తో బాలకృష్ణ సినిమా ఉండకపోవచ్చని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ, బాలకృష్ణతో తన సినిమా ఉందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ .. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు బాలకృష్ణతో బోయపాటి సినిమా తరువాత ఉంటుందా? అనిల్ రావిపూడి సినిమా తరువాత ఉంటుందా? అనేది చూడాలి. గతంలో బాలకృష్ణ .. వినాయక్ కాంబినేషన్లో 'చెన్నకేశవ రెడ్డి'వచ్చిన సంగతి తెలిసిందే.