గొడవపడి కత్తులతో పొడుచుకున్న రజనీ, అజిత్ అభిమానులు!
- నేడు విడుదలైన రెండు చిత్రాలు
- తమిళనాడులో పలు ప్రాంతాల్లో గొడవలు
- వేలూరులో నలుగురికి తీవ్రగాయాలు
తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరోవైపు మధురై ప్రాంతంలోనూ అభిమానుల మధ్య గొడవ జరిగింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో 'విశ్వాసం' కన్నా ముందు 'పేట' ప్రారంభం కావడంతో అజిత్ అభిమానులు వీరంగం సృష్టించారు.