'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
- తేజ దర్శకత్వంలో 'సీత' సినిమా
- తదుపరి సినిమా రమేశ్ వర్మతో
- ఆ తరువాత అజయ్ భూపతితో సెట్స్ పైకి
అజయ్ భూపతి తెరకెక్కించిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అలాంటి అజయ్ భూపతితో కలిసి పనిచేయడానికి యువ హీరోలంతా ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి ఒక కథను బెల్లంకొండ శ్రీనివాస్ కి వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. రమేశ్ వర్మ ప్రాజెక్టు తరువాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.