వైసీపీ అధినేత జగన్‌లో నాకు బుద్ధుడు కనిపిస్తున్నాడు: సినీ నటుడు భాను చందర్
- ప్రజా సేవ కోసమే వైసీపీలో చేరా
- జగన్‌లో ఓర్పు, ఔదార్యం ఉన్నాయి
- విశాఖలో విలేకరులతో భాను చందర్
శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం టెక్కలిలో జగన్‌ను కలిసిన భానుచందర్ పాదయాత్రలో ఆయనతో పాటు కలిసి నడిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చినట్టు చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గొప్ప విషయమని ఈ సందర్భంగా భానుచందర్ పేర్కొన్నారు.