పట్టువీడని ధనుశ్ .. అదే రోజున సినిమా విడుదల ఖాయమట!
- ధనుశ్ హీరోగా 'మారి 2'
- ఈ నెల 21వ తేదీన విడుదల
- అదే రోజున రానున్న 'పడి పడి లేచె మనసు'
తెలుగులో సాయిపల్లవి చేసిన 'పడి పడిలేచె మనసు' కూడా అదే రోజున థియేటర్లకు రానుంది. సాయిపల్లవి చేసిన రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తున్నాయన్న మాట. ఇది 'పడి పడి లేచె మనసు' నిర్మాతలకి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఒక వారం ఆలస్యంగా విడుదల చేసుకోమని డిస్ట్రిబ్యూటర్లు కోరినా ధనుశ్ వినిపించుకోవడం లేదట. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున తన సినిమా రావలసిందేనని అంటున్నాడట. ఇక ఇదే రోజున వరుణ్ తేజ్ 'అంతరిక్షం'కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.