భారీ సెట్లు .. అద్భుతమైన గ్రాఫిక్స్ .. జనవరిలో సెట్స్ పైకి 'హిరణ్య కశిప'
- 'హిరణ్యకశిప'గా రానా
- ముగింపు దశలో భారీ సెట్ల నిర్మాణం
- విదేశాల్లో జరగనున్న గ్రాఫిక్స్ వర్క్
అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో గ్రాఫిక్స్ కి సంబంధించిన ప్లానింగ్ సిద్ధమైపోయిందట. అలాగే హైదరాబాద్ లో భారీ సెట్స్ నిర్మాణాలు కూడా ముగింపు దశకి చేరుకున్నాయి. సురేశ్ బాబు .. గుణశేఖర్ మాట్లాడుకుని, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సురేశ్ బాబు వున్నట్టుగా తెలుస్తోంది. రానా కెరియర్లో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నారట.