డౌట్ లేదు .. 'సైరా'లో భాగం కానున్న బన్నీ!
- షూటింగు దశలో 'సైరా'
- భారీ బడ్జెట్ తో నిర్మాణం
- వచ్చే వేసవిలో విడుదల
ఈ సినిమా వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. బన్నీ వాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది .. వినగానే ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. బన్నీకి గల క్రేజ్ కారణంగా వాయిస్ ఓవర్ ఆయనతో చెప్పిస్తే బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడట. ఈ విషయాన్ని ఆయన చిరంజీవి దగ్గర ప్రస్తావించగా, బన్నీతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే బన్నీతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.