యువతిని ఆకర్షించేందుకు గుడ్లగూబను బలిచ్చిన వ్యక్తి... అరెస్ట్!
- ఓ యువతిని ఇష్టపడ్డ ట్రక్ డ్రైవర్
- ఆమె తనను ఇష్టపడేందుకు తాంత్రిక విద్యను ఆశ్రయించిన వైనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
ఈ క్రమంలో ఓ గుడ్లగూబను ఇంటికి తీసుకొచ్చి... తొలుత కత్తితో దాని కాళ్లను కట్ చేశాడు. ఆ తర్వాత ఊపిరితిత్తులు, కాలేయంలో గుండుసూదులు గుచ్చి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటనకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఫిర్యాదు అందడంతో... పోలీసులు కన్హయ్య ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న కూలర్ లో గుడ్లగూబ మృతదేహాన్ని కనుగొన్నారు. గుడ్లగూబ శరీరంలో గుండుసూదులను గుచ్చడం వల్లే అది మరణించిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కన్హయ్య తీశాడు. ఆ వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడ్లగూబ అతనికి ఎలా దొరికింది? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో... అనారోగ్యంతో కదలలేని స్థితిలో గుడ్లగూబ తనకు కనిపించిందని... దాన్ని ఇంటికి తీసుకొచ్చానని అతను తెలిపాడు. అయితే, గుడ్లగూబకు ఎలాంటి అనారోగ్యం లేదని పోస్టుమార్టంలో తేలింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.