'ఆర్ ఎక్స్ 100' హీరో స్పీడ్ మీదే వున్నాడు
- కార్తికేయ నెక్స్ట్ మూవీగా 'హిప్పీ'
- ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్
- తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం
తమిళ దర్శకుడు టి.ఎన్. కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలు కానుంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే కార్తికేయ తమిళ ప్రేక్షకులకి కూడా పరిచయం కానున్నాడన్న మాట.