గ్లామర్ పాత్రలు చేయనంటున్న హన్సిక!
- నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తా
- పెళ్లికి అప్పుడే తొందరేమీ లేదు
- అమ్మ ఎవర్ని చేసుకోమంటే వారిని చేసుకుంటా
ఈ వార్తలపై హన్సిక స్పందిస్తూ, తన వయసు ఇంకా 27 సంవత్సరాలేనని... పెళ్లికి తొందరేం లేదని చెప్పింది. తన పెళ్లి విషయాన్ని అమ్మే చూసుకుంటుందని తెలిపింది. అమ్మ ఎవరిని చేసుకోమంటే అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఏడాది కాలంలో 18 కథలు విన్నానని... అందులో నాలుగింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది. మిగిలినవన్నీ గ్లామర్ పాత్రలేనని... ఇకపై గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తానని తెలిపింది.