కాపీ వివాదంలో త్రిష హిట్ మూవీ!
- '96' కథ నా అసిస్టెంట్ రాశాడు
- అతని ఫ్రెండ్ ద్వారా కథ బయటికి వెళ్లింది
- భారతీరాజా ఆరోపణల్లో నిజం లేదు
దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ, 'నా అసిస్టెంట్ సురేశ్ రాసుకున్న కథ ఇది. ఈ కథ మరుధ పాండియన్ అనే వ్యక్తి ద్వారా ప్రేమ్ కుమార్ కి వెళ్లింది. గతంలో సురేశ్ కి స్నేహితుడిగా వున్న మరుధ పాండియన్ మోసం చేశాడు' అన్నారు. ఈ విషయంపై ప్రేమ్ కుమార్ స్పందిస్తూ .. 'ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. అందరి జీవితాల్లో కామన్ గా జరిగే సంఘటనలతో ఈ కథను రూపొందించాను. ఈ సినిమా హిట్ కావడం వలన ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ వివాదాన్ని చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా వున్నాను' అని చెప్పుకొచ్చాడు.