అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది: త్రివిక్రమ్
- నేను పంచ్ లు రాయడం మానేశాను
- కొత్త పద్ధతిలో నా డైలాగ్స్ ఉంటాయి
- 'మాటల మాంత్రికుడు' అనొద్దు
"నేను పంచ్ లు బాగా రాస్తానని కొంతమంది అంటారు. మరి కొంతమంది 'మాటల మాంత్రికుడు' అంటారు. ఇలా అనిపించుకోవడం .. పిలిపించుకోవడం నాకు ఎంతమాత్రం నచ్చని పని. అలా నన్ను పిలిచేవాళ్లపై నాకు కోపం వస్తుంది .. అలాంటి వాళ్లను నా శత్రువులుగా భావిస్తూ వుంటాను. ఎందుకంటే అందరూ పంచ్ డైలాగ్స్ రాస్తుండటంతో నేను మానేశాను .. అలా పంచ్ లు రాయడం మానేసి చాలా కాలమే అయింది. నా ఆలోచనా విధానంలో నుంచి పుట్టిన స్టేట్ మెంట్స్ ను డైలాగ్స్ గా రాస్తున్నాను. అందువలన ఇక ఎవరూ నా స్టైల్ ని కాపీ కొట్టలేరు" అని చెప్పుకొచ్చారు.