అరాచక పాలన పోయి.. స్వర్ణయుగం రావాలంటే జగన్ సీఎం కావాలి: నటుడు పృథ్వి
- వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి
- జగన్ ను సీఎం చేసేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలి
- జగన్ ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనను అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులంతా ఉత్సాహంగా పని చేయాలని చెప్పారు. జగన్ ను సీఎం చేసి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు. వైయస్ స్వర్ణయుగం జగన్ తోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.