వరదల్లో చిక్కుకున్న కార్తీ సినిమా టీమ్ .. నిర్మాతకి భారీ నష్టం
- కార్తీ హీరోగా సెట్స్ పై 'దేవ్'
- 50 కోట్ల రొమాంటిక్ ఎంటర్టైనర్
- డిసెంబర్ 21వ తేదీన రిలీజ్
అయితే, తాజాగా అక్కడి వరదల కారణంగా ఈ రోజు షూటింగు ఆగిపోయింది. ఈ సినిమా కోసం పనిచేస్తోన్న 140 మంది వరదల్లో చిక్కుకుపోయారు. షూటింగు ఆగిపోయిన కారణంగా నిర్మాతకి 1.5 కోట్ల నష్టం వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇంతకుముందు కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.