'ఆర్ ఎక్స్ 100' హీరోతో కొత్త చిత్రం
- 'ఆర్ ఎక్స్ 100' సూపర్ హిట్
- నెక్స్ట్ మూవీగా 'హిప్పీ'
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజున కార్తికేయ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ప్రస్తుతం వాళ్ల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.