'అజర్ బైజాన్' కి చరణ్ .. అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి తెలుగు చిత్రం ఇదే!
- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- ముఖ్య పాత్రల్లో ప్రశాంత్ .. స్నేహా
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తూ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో, సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహా .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండటం విశేషం. పవన్ పుట్టినరోజు సందర్భంగా వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.