కొత్త రికార్డును సృష్టించిన నయనతార సినిమా!
- నయన్ ప్రధాన పాత్రగా 'కొలమావు కోకిల'
- 9 రోజుల్లో 20 కోట్ల గ్రాస్
- ఈ నెల 31న తెలుగులో విడుదల
ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సౌత్ లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే మొదటి సారి. ఈ అరుదైన రికార్డును నయనతార సొంతం చేసుకోవడం పట్ల ఆమె అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో ఈ సినిమాను 'కోకో కోకిల'అనే పేరుతో ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.