ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'యూ టర్న్' ట్రైలర్
- థ్రిల్లర్ నేపథ్యంలో 'యూ టర్న్'
- ప్రధాన పాత్రలో సమంత
- సెప్టెంబర్ 13వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కథ అంతా కూడా 'ఆర్కే పురం' ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఓ వైపున ఆ ప్రమాదం విషయంలో కొన్ని ఆధారాల కోసం సమంత ప్రయత్నిస్తూ వుంటుంది .. మరో వైపున పోలీస్ ఆఫీసర్స్ ఆమెను అనుమానిస్తుంటారు. ఆసక్తికరమైన మలుపులు .. ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతోంది.