బాలకృష్ణతో వినాయక్ మూవీ ఖరారైపోయింది
- బాలకృష్ణతో సినిమా ఉంటుంది
- నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరిస్తారు
- స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది
కానీ తమ కాంబినేషన్లో సినిమా ఉందని తాజాగా వినాయక్ చెప్పాడు. "బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయనున్నాను .. ఈ ప్రాజెక్టుకి నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరిస్తారు. స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా ఉండటం కోసం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా సిద్ధంగా వుంది" అన్నాడు. దాంతో బాలకృష్ణతో వినాయక్ మూవీ ఉండటం ఖాయమని తెలుస్తోంది. 'ఎన్టీఆర్' బయోపిక్ తరువాత బాలకృష్ణ .. బోయపాటితో సెట్స్ పైకి వెళతాడో .. వినాయక్ తో కలిసి రంగంలోకి దిగుతాడో చూడాలి.