15 కోట్లు కొల్లగొట్టిన 'ఆర్ ఎక్స్ 100'!
- భారీ ఓపెనింగ్స్ తో మొదలు
- నాలుగు రోజుల్లో 10 కోట్ల గ్రాస్
- ఒక్క తెలంగాణలోనే 3 కోట్ల షేర్
కేవలం రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, తొలి నాలుగు రోజులలోనే 10 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది. 6 వ రోజు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 15 కోట్లకి చేరుకున్నాయి. ఒక్క తెలంగాణలోనే ఈ సినిమా 3 కోట్ల షేర్ ను రాబట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే సమయంలో థియేటర్స్ కి వచ్చిన 'విజేత ' .. చినబాబు' .. 'ఆర్ ఎక్స్ 100' స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా వసూళ్ల పరంగా ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశమని చెప్పాలి.