శశిథరూర్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ
- బీజేపీపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన థరూర్
- బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. హిందూ పాకిస్థాన్ వస్తుందంటూ వ్యాఖ్య
- థరూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు
రానున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే... ఆ పార్టీ సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటుందని, సొంత చట్టాలను తెస్తుందని థరూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ పాకిస్థాన్ గా భారత్ మారిపోతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. శశిథరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.