మెల్ బోర్న్ ఫెస్టివల్ కి 'మహానటి' .. ఆనందంలో నాగ్ అశ్విన్
- సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
- మూడు కేటగిరీల్లో ఎంపిక
- ఆగస్టు 10 నుంచి వేడుక
కీర్తి సురేశ్ ప్రధానపాత్రను పోషించిన ఈ సినిమా, ఉత్తమ చిత్రం .. ఉత్తమ నటి .. ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీపడుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ .. ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'మహానటి' విదేశాల్లోను ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఉత్తమనటి కేటగిరీలో దీపికా పదుకొనే (పద్మావత్) .. అలియా భట్ (రాజీ) .. రాణీముఖర్జీ (హిచ్ కీ) .. విద్యాబాలన్ (తుమ్హారీ సులు) తో కీర్తి సురేశ్ పోటీపడనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆగస్టు 10 నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.