తొలిరోజే అదరగొట్టేసింది .. లాభాల దిశగా 'ఆర్ ఎక్స్ 100'
- అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ ఎక్స్ 100'
- యూత్ ను ఆకట్టుకునే కంటెంట్
- నిన్ననే ప్రేక్షకుల ముందుకు
దాంతో సహజంగానే ఈ సినిమా థియేటర్ల దగ్గర యూత్ ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తొలిరోజున ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లిందట. 2.70 కోట్లకి అమ్ముడైన ఈ సినిమా, తొలిరోజునే 1.41 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం. వీకెండ్ లోనే ఈ సినిమా లాభాల బాట పడ్డటం ఖాయమని అంటున్నారు. పోస్టర్ విడుదల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా ఉండటంతో, యూత్ లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అదే ఈ స్థాయి వసూళ్లకు కారణమైందని చెప్పుకుంటున్నారు.