నా రెమ్యునరేషన్ ఇవ్వకపోతే అన్నయ్యపై ఫిర్యాదు చేస్తాను: కార్తీ
- కార్తీ హీరోగా 'చినబాబు'
- రైతు నేపథ్యంలోని కథ
- ఈ నెల 13వ తేదీన విడుదల
సినిమా ఎలా వచ్చింది అని అన్నయ్యను అడిగితే .. ఆ విషయం నేను కాదు ప్రజలు చెప్పాలి అన్నాడు. నాకైతే ఈ సినిమాపై బలమైన నమ్మకం వుంది. ఈ సినిమాలో విలన్ ను ప్రత్యేకంగా చూపించడం ఉండదు. అదే ఊళ్లో .. మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి .. విలన్ గా మారడం ఉంటుంది. మాది వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం వలన, మా ఇంట్లోని వాళ్లంతా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నారు. ఇక ఈ సినిమా బాగా ఆడితేనే మా అన్నయ్య నాకు పారితోషికం ఇస్తానని అంటున్నాడు. ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేద్దామని అనుకుంటున్నాను" అంటూ నవ్వేశాడు.