180 కోట్ల బడ్జెట్ తో రానా 'హిరణ్యకశిప'
- గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
- నిర్మాతగా సురేశ్ బాబు
- భారీ సెట్స్ కి సన్నాహాలు
ఈ సినిమా కోసం 180 కోట్లను ఖర్చు చేయనున్నారనేది తాజా సమాచారం. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు .. మంటపాలు .. దేవలోకం .. వైకుంఠం .. ఉద్యానవనాలు వంటి సెట్స్ ను గీయిస్తున్నారట. కాస్ట్యూమ్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రాఫిక్స్ కి కూడా పెద్దపీట వేస్తూ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.