'ఈ నగరానికి ఏమైంది' సినిమాపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేటీఆర్
- సినిమాలో ఒక్క స్టార్ కూడా లేడని తరుణ్ చెప్పడంతో ఆశ్చర్యపోయా
- స్టార్లను కాకుండా, కథలను నమ్మి సినిమాలు తీయాలి
- తరుణ్ కుటుంబంతో నాకు మంచి పరిచయం ఉంది
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఒక్క స్టార్ కూడా లేకుండానే ఈ సినిమాను తీశానని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పడంతో, ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. తరుణ్ కుటుంబంతో తనకు మంచి పరిచయం ఉందని, కానీ సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ మాట్లాడేవాడు కాదని తెలిపారు. తరుణ్ ఇదే విధంగా ముందుకు సాగాలని... స్టార్లను కాకుండా, మంచి కథలను నమ్మి సినిమాలను తెరకెక్కించాలని అభిలషించారు.