సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెంకటేశ్ తో మరోసారి నయనతార
- యుద్ధం నేపథ్యంలో నారా రోహిత్ సినిమా
- జపాన్ కు వెళుతున్న 'మగధీర'
* నారా రోహిత్ తన తొలి చిత్ర (బాణం) దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. బాణం, బసంతి వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య తాజాగా రోహిత్ కోసం యుద్ధం నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశాడట.
* గతంలో రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి చిత్రం 'మగధీర'ను జపాన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలోకి అనువదించే పనులు జరుగుతున్నాయట.