ప్రతి హీరోయిన్ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోలేము కదా?: శివాజీ రాజా
- వీసా నిబంధనలను అవగతం చేసుకోవాలి
- అంతా సురక్షితమని భావిస్తేనే విదేశాలకు వెళ్లాలి
- అమెరికా సెక్స్ రాకెట్ పై 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా
వీసా నిబంధనలు పూర్తిగా అవగతం చేసుకున్న తరువాత, తాము సురక్షితంగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని అనుకున్నప్పుడే వెళ్లాలని సలహా ఇచ్చారు. ఎవరికైనా ఆహ్వానాలు అందితే, ఆ వివరాలు తమకు తెలపాలని, సదరు ఈవెంట్ నిర్వాహకుల గత చరిత్రను పరిశీలించి సలహాలు ఇస్తామని తెలిపారు. అమెరికా సెక్స్ రాకెట్ పై చర్చించేందుకు 24న ప్రత్యేకంగా సమావేశం కానున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, విదేశాలకు హీరోయిన్లు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా 'మా'కు తెలియజేయాలన్న నిబంధనను టాలీవుడ్ పెద్దలు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.