పోసానిని హైదరాబాదులో తిరగనివ్వం: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడి వార్నింగ్
- చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన పోసాని
- మెంటల్ కృష్ణగా అభివర్ణించిన శ్రీనివాస్
- బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడారంటూ ఆగ్రహం
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్ ను ముగించుకుని పోసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.