ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు టీడీపీ జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా?: పోసాని కృష్ణమురళి
- చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసాని
- ఒక మగ వగలాడి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టా
- ఆ మగ వగలాడి సీఎం నారా చంద్రబాబునాయుడు
ఈ విషయాలను మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే.. ప్రజల్లోకి ఈ విషయాలు వెళ్లడం చాలా అవసరమని అన్నారు. ‘జగన్ అనే వ్యక్తి 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే..ఆ ఎమ్మెల్యేలను తన వైపు సిగ్గులేకుండా ఎలా తిప్పుకున్నారో ఈ ఫొటోలు చూడండి... ‘అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు’ నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ‘కొత్త పలుకు’లో రాధాకృష్ణ అన్న స్వయంగా రాశారు. ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉంది? అది ఎలాంటి ఆరాటమంటే.. సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొచ్చి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి.. వాళ్లకు డబ్బులిచ్చి తన వైపు లాక్కోవడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమా? అలాగే, ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనేసి..అక్కడి నుంచి పారిపోయి..కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీశ్ రావు కాళ్లు పట్టుకుని విజయవాడ పారిపోయిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డలను కూడా మర్చిపోయారంట’ అంటూ దుమ్మెత్తి పోశారు.