షూటింగులో ఉండగా ఓ అనుకోని సంఘటన జరిగింది: నటి సుధ
- 'క్లాస్ మేట్స్' షూటింగులో వున్నాను
- సీన్ చేసి వచ్చి కూర్చున్నాను
- ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది
విషయమేమిటో అర్థంకాక నేను షాక్ అయ్యాను. ఎవరీ అమ్మాయి .. ఎందుకిలా చేస్తోంది అని అనడంతో అంతలో ఆ అమ్మాయి వాళ్ల అమ్మమ్మ అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ల అమ్మ అప్పటికి నాలుగు నెలల క్రితం యూఎస్ లో యాక్సిడెంట్ లో చనిపోయిందట. ఆమె ఫోటోను నాకు చూపించారు .. అచ్చు ఆమె నా మాదిరిగానే వుంది. మనిషిని పోలిన మనుషులు వుంటారనే విషయాన్ని కూడా నేను అప్పటి నుంచే నమ్మడం మొదలుపెట్టాను. నేను అచ్చంగా వాళ్ల అమ్మలా ఉండటంతో ఆ అమ్మాయి దుఃఖం ఆపుకోలేక అలా చేసింది పాపం" అని చెప్పుకొచ్చారు.