బ్రిటిష్ సైన్యంపై దాడి చేయనున్న 'సైరా'.. యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ!
- చిరంజీవి హీరోగా సెట్స్ పై 'సైరా'
- యాక్షన్ ఎపిసోడ్ కి సన్నాహాలు
- వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు
బ్రిటీష్ సైన్యంపై 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' దాడి చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలను ఉత్కంఠభరితంగా .. అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించనున్నారట. బ్రిటీష్ సైనికులతో నరసింహా రెడ్డి తలపడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొదట ఈ యాక్షన్ సీన్ ను విదేశాల్లో చిత్రీకరించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వలన హైదరాబాద్ లోనే చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.