సన్నీ లియాన్ కు 'సారీ' చెప్పిన రాఖీ సావంత్!
- గతంలో సన్నీపై రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఏమీ తెలుసుకోకుండానే మాట్లాడాను
- 'జజ్ బాత్'లో క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్
సన్నీలియాన్ ఇండస్ట్రీకి వచ్చి హిందీ చిత్రాలు చేయడం ప్రారంభించిన కొత్తల్లో, తాను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమించాలని కోరింది. సన్నీ గురించి, ఆమె జీవితంలో పడిన కష్టాలను గురించి తనకా సమయంలో ఏ మాత్రం తెలియదని, ఏమీ తెలుసుకోకుండానే ఆమె సాగించిన ప్రయాణం గురించి వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పింది. అప్పట్లో అలా అనుండాల్సింది కాదని అభిప్రాయపడింది.