ఆ అధికారి స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’..ఆయనలో నాగ్ పోలికలున్నాయి: దర్శకుడు వర్మ
- కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కేఎమ్ ప్రసన్న
- ముంబైలో ఓ కేసుకు సంబంధించి ఆయన పనిచేశారు
- ఈ కేసుకు సంబంధించిన విషయాలను 2010లో నాకు చెప్పారు
ఈ కేసుకు సంబంధించిన విషయాలను 2010లో స్వయంగా ప్రసన్న తనకు వెల్లడించారని, ఆ విషయాలు విన్న తర్వాత ఓ సినిమా తీయాలనిపించిందని, ఆ స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’ చిత్రాన్ని తెరకెక్కించానని అన్నారు. నాగార్జున, ప్రసన్నను కలిశాక తానో విషయం గమనించానని, వాళ్లిద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉందని, అంతేకాకుండా, ప్రసన్నలో కొంచెం నాగార్జున పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం, ముంబై క్రైమ్ బ్రాంచ్ లో అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ప్రసన్న పనిచేస్తున్నారని చెప్పారు.