ప్రకటనల్లో కనిపించాలని ప్రధాని మోదీకి కాంక్ష: ఖుష్బూ విమర్శలు
- ప్రకటనలపై నాలుగేళ్ల కాలంలో రూ.4343 కోట్ల ఖర్చు
- కామరాజర్ ప్రతి రూపాయి విద్య కోసం ఖర్చు చేశారు
- ప్రధాని మోదీ మాత్రం ప్రకటనల కోసం ఖర్చు పెట్టి భారం వేశారు
దీనిపై ఖష్బూ స్పందించారు. దివంగత కామరాజర్ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ప్రతి రూపాయిని విద్య కోసం ఖర్చు చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేసి ప్రజలపై భారం మోపారని పేర్కొన్నారు. ఆయనకు టీవీలు, పత్రికల్లో కనిపించాలన్న మోజు ఉందని తెలుస్తోందన్నారు.