పవన్ మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు.. వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలి: ప్రకాశ్ రాజ్
- వలస నేతలు మోసం చేసే ప్రమాదం ఉంది
- మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్‌ను ఆహ్వానిద్దాం
- మోదీలా అసత్యాలు చెప్పే వారిని నేను ఎక్కడా చూడలేదు
- ప్రశ్నిస్తున్నందుకే నాకు యాడ్స్ కూడా రావడం లేదు
ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిద్దామని ప్రకాశ్ రాజ్ అన్నారు. కాగా, ప్రధాని మోదీలా అసత్యాలు చెప్పే వారిని తాను ఎక్కడా చూడలేదని, తాము సర్కారుని ప్రశ్నిస్తోంటే వారు వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని అన్నారు. ప్రశ్నిస్తున్నందుకే తనకు నటించడానికి కమర్షియల్ యాడ్స్ కూడా రావడం లేదని తెలిపారు.