సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- ప్రియుడితో నయనతార ప్రేమయాత్ర
- విలన్ గా మారుతున్న రాజశేఖర్
- నాగార్జునతో తేజ ప్రాజక్ట్
* ఇటీవల 'గరుడవేగ' చిత్రంతో హిట్ కొట్టిన సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు తన రూటు మారుస్తున్నాడు. యంగ్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో విలన్ గా కీలక పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడట.
* ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి తప్పుకున్న ప్రముఖ దర్శకుడు తేజ తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు సమాచారం.