టాలెంట్ కి అదృష్టం తోడు కావలసిందే.. అది నా విషయంలో జరిగింది!: కోట శ్రీనివాసరావు
- నా కంటే గొప్ప నటులు వున్నారు
- అయినా నాకే 'పద్మశ్రీ' దక్కింది
- అది నాకు రాసిపెట్టి ఉందంతే
తనకి 'పద్మశ్రీ' పురస్కారం దక్కడం గురించి ఆయన ప్రస్తావించారు. "'పద్మశ్రీ' అన్నారు కనుక చెబుతున్నాను .. నటనలో నా కంటే మహానుభావులు ఎంతోమంది వున్నారు. కేరక్టర్ ఆర్టిస్టుల కేడర్ తీసుకుంటే నా కంటే గొప్పవాళ్లు ఎంతోమంది కనిపిస్తారు. వాళ్లెవరికీ ఈ పురస్కారం దక్కలేదు. అలాగని చెప్పేసి నేను మాత్రమే గొప్పవాడినని కాదు .. నాకు రాసి పెట్టి ఉందంతే. ఎవరికైనా సరే నూటికి 95 శాతం టాలెంట్ వుంటే సరిపోదు .. ఒక 5 శాతం అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ రెండూ నాకు కలిసొచ్చాయి" అంటూ చెప్పుకొచ్చారు.