'భరత్'కి అదనంగా జోడిస్తోన్న 'హోలీ' ఫైట్!
- దూసుకుపోతోన్న 'భరత్ అనే నేను'
- రికార్డు స్థాయిలో వసూళ్లు
- మహేశ్ అభిమానుల్లో సంతోషం
ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ప్రెస్ మీట్ లోనే కొరటాల మాట్లాడుతూ, నిడివి కారణంగా 'హోలీ' ఫైటింగ్ సీన్ ఒకటి ఫైనల్ ఎడిటింగ్ లో తీసేయవలసి వచ్చిందనీ, త్వరలోనే దానిని యాడ్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పాడు. అన్నట్టుగానే ఇప్పుడు ఆ సీన్ ను జత చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి సినిమాలో ఈ కొత్త సీన్ ను కూడా చూడవచ్చని చెబుతున్నారు. అదనంగా ఈ సీన్ ను జోడించడం .. సినిమాను మరింత వేగంగా మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. మరి 'హోలీ' ఫైట్ ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.