తన కూతురు పెళ్లిపై హీరో అనిల్ కపూర్ స్పందన!
- ఆనంద్ అహుజాతో కోన్నేళ్లుగా సోనమ్ ప్రేమాయణం
- విద్యుత్ దీపాల వెలుగుల్లో అనిల్ కపూర్ నివాసం
- పెళ్లి సందడి మొదలైందంటూ మీడియాలో కథనాలు
తాజాగా ముంబైలోని అనిల్ కపూర్ నివాసాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో, ఇంట్లో పెళ్లి సందడి మొదలైందనే వార్తలు వెల్లువెత్తాయి. పెళ్లి ఏర్పాట్లలో భాగంగానే, విద్యుత్ దీపాలతో అలంకరించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై తాజాగా అనిల్ కపూర్ స్పందించాడు. సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. తన కెరీర్ తొలినాళ్ల నుంచి మీడియా తనకు ఎంతో సపోర్ట్ చేసిందని... తమ కుటుంబంలో ఏది జరిగినా మీడియాకు సవివరంగా వెల్లడిస్తామని.. తన కుమార్తె పెళ్లి విషయంలో దాచేందుకు ఏమీ లేదని చెప్పారు.