'యు టర్న్' కోసం పారితోషికం తీసుకోని సమంత!
- షూటింగు దశలో 'యు టర్న్'
- జర్నలిస్ట్ పాత్రలో సమంత
- కీలకమైన పాత్రలో భూమిక
జర్నలిస్ట్ గా ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందిస్తుండటం వలన, ముందుగా సమంత పారితోషికం తీసుకోవడం లేదట. సినిమా సక్సెస్ అయిన తరువాత లాభాల్లో వాటాను పొందేలా మాట్లాడుకుందని సమాచారం. ఈ తరహా అగ్రిమెంట్ పై సమంత సినిమా చేయడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. భూమిక .. ఆది .. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.