ముఖ్యమంత్రి పాత్రకి మహేశ్ ను అనుకున్నది అందుకేనట!
- ముఖ్యమంత్రి పాత్ర స్వభావం అది
- ఆ లక్షణాలు మహేశ్ లో వున్నాయి
- ఆయన కుదరదంటే ఈ సినిమా వుండేది కాదు
అనవసరంగా కోపం తెచ్చుకోని ముఖ్యమంత్రి పాత్ర ఇది. గొంతు పెంచి గట్టిగా మాట్లాడటం .. స్పీచ్ లు దంచేయడం ఈ పాత్రలో కనిపించవు. అవతలవారికి అర్థమయ్యేలా సూటిగా .. సున్నితంగా చెప్పే పాత్ర ఇది. ఈ లక్షణాలు మహేశ్ బాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయనను అనుకోవడం జరిగింది .. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ కుదరదని చెప్పి వుంటే ఈ సినిమాయే లేదు" అని చెప్పుకొచ్చారు.