కొరటాల .. మహేశ్ లకు సినీ ప్రముఖుల ప్రశంసలు
- కొరటాల ప్రయత్నం పట్ల అభినందనలు
- మహేశ్ నటనకు ప్రశంసలు
- మిగతా ప్రముఖుల నుంచి ట్వీట్ల వెల్లువ
రాజమౌళి .. వంశీ పైడిపల్లి .. శ్రీను వైట్ల .. హరీశ్ శంకర్ .. వెంకీ అట్లూరి .. తమన్ .. కల్యాణ్ రామ్ .. నిఖిల్ .. రకుల్ ఈ సినిమా బాగుందంటూ ప్రశంసించారు. కథాకథనాలను కొరటాల నడిపించిన తీరు పట్ల, సమాజాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యలకు పరిష్కారాలు చూపిన తీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'భరత్' పాత్రలో మహేశ్ చాలా అద్భుతంగా నటించాడంటూ అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇంకా చాలామంది సినీ ప్రముఖులు వరుస ట్వీట్స్ చేస్తుండటం విశేషం.